Header Banner

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ప్రారంభం! పూర్తి వివరాలు ఇవే!

  Mon Apr 21, 2025 09:48        Education

జేఈఈ మెయిన్‌ 2025 తుది ర్యాంకులు శుక్రవారం అర్ధరాత్రి (ఏప్రిల్ 19) విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో దేశవ్యాప్తంగా 2,50,236 మంది కనీస కటాఫ్‌ పర్సంటైల్‌ స్కోర్‌ సాధించి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత సాధించారు. ఆ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) కటాఫ్‌తోపాటు అర్హుల జాబితాను విడుదల చేసింది. మెయిన్‌కు రెండు విడతల్లో కలిపి దేశ వ్యాప్తంగా దాదాపు 15.39 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 14.75 లక్షల మందే పరీక్షలు రాశారు. అయితే చివరకు 2.50 లక్షల మంది మాత్రమే కనీస మార్కులు సాధించారు. వీరంతా దేశంలోని ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు సీట్లు పొందేందుకు అర్హత సాధించారు. ఇక ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో ర్యాంకు సాధించవల్సి ఉంటుంది.

ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష 2025కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఏప్రిల్ 23వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. మే 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఇక పరీక్ష కూడా ఇదే నెలలో ప్రారంభం కానుంది. జేఈఈ మెయిన్‌ రెండు సెషన్లలో కనీస స్కోర్‌ సాధించిన 2.50 లక్షల మంది మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, అమ్మాయిలు రూ.1600, ఇతరులు రూ.3,200 చొప్పున ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు మే 11వ తేదీన విడుదల అవుతాయి. ఇక మే 18వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ విధానంలో జరగనుంది.


మే 18న రెండు సెషన్లలో రెండు పేపర్లకు పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు సెషన్లకు హాజరుకావాల్సి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలే జూన్‌ 2వ తేదీన వెల్లడిస్తారు. ఆ తర్వాత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసి సీట్లను భర్తీ చేస్తారు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 17,695 బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్‌) సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది మరికొన్ని సీట్లు పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బీఆర్క్‌ కోర్సుల్లో చేరాలనుకునే వారు ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఏఏటీ) రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష జూన్‌ 5న ఉంటుంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులుఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..రేసులో 'ఆ నలుగురునేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛతతాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టిపట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #JEEAdvanced2025 #JEENotification #JEEAdvancedRegistration #EngineeringEntrance #IITDream